- Advertisement -
టిఎస్ ఆర్టీసి అధ్వర్యంలో ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక..
టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్ జారీచేసి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.వీటిలో ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3, ట్యూటర్ 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ నర్సింగ్ చేసి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లిస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- Advertisement -