ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో సెల్ఫ్ ఎమ్పవర్మెంట్ వన్డే వర్క్ షాప్
Self Empowerment One Day Workshop at Trinity Engineering Collegeపెద్దపల్లి
పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ సహకారంతో “సెల్ఫ్ ఎంపవర్మెంట్” పై ప్రత్యేక వన్డే వర్క్ షాప్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్లమా రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేయగా, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ కౌశల్య విద్యార్థులకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ పై చైతన్యాన్ని పెంచి, వారి జీవిత లక్ష్యాలను సాధించే దిశగా ఉత్తేజం కలిగించారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి గారి కార్యచరణలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు సొంతంగా వారి సామర్థ్యాలను గుర్తించడంలో సహాయపడుతుందని , అదే సమయంలో వారి వ్యక్తిగత, వృత్తి క్షేత్రాలలో విజయం సాధించడానికి కావలసిన ప్రేరణను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ మణి గణేష్, ఏవో సురేష్, రాజిరెడ్డి,టాస్క్ కోఆర్డినేటర్ మధుశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.




