Tuesday, March 18, 2025

 సేనాని ఈజ్ బ్యాక్

- Advertisement -

 సేనాని ఈజ్ బ్యాక్
అమరావతి

Senani ice back

పవన్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో.. పవన్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పడానికి.. అసెంబ్లీ సాక్ష్యంగా మారింది. ఒక్కో మాట.. ఒక్కో తూటాలా వినిపించింది. స్వరం మారేదే లేదు.. స్టాండ్‌లో మార్పు లేదు అన్నట్లుగా ఫ్యాన్ పార్టీని చెడుగుడు ఆడుకున్నారు పవన్. పొత్తుల నుంచి అసెంబ్లీలో వైసీపీ ఎత్తుల వరకు.. కొన్నింటికి క్లారిటీ, ఇంకొన్నింటికి తన మార్క్ వార్నింగ్ ఇచ్చారు. సేనాని ఈజ్ బ్యాక్ అనిపించారు.వైసీపీ, పవన్ యుద్ధం.. ఎప్పటికీ చల్లారనిది! అదే అనిపించింది అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాటలు వింటే. నిజానికి ఎన్నికల ముందు ఫ్యాన్‌ పార్టీని పవన్.. అంశాలవారీగా చీల్చి చెండాడారు. డిప్యూటీ సీఎం అయ్యాక.. పాలనపై మీదే ఫోకస్ పెట్టి తన పని తాను చేసుకోపోతున్నారు. ఐతే వైసీపీ నుంచి మాత్రం విమర్శలు ఆగలేదు.కూటమిలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయని.. పవన్‌ దూరం జరుగుతున్నారంటూ సోషల్‌మీడియా వేదికగా వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.
ఐతే వాటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్.. అసెంబ్లీ సాక్షిగా విరుచుకుపడ్డారు. పాత పవన్‌ను గుర్తు చేశారు. అదే ఫైర్.. అదే దూకుడు.. తగ్గేదే లే, తగ్గింది లే అన్నట్లుగా పవన్ మాటలు వినిపించాయ్.అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు 20 నిమిషాలు మాత్రమే సభకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. గందరగోళం క్రియేట్ చేశారు. స్పీకర్‌ పోడియం ఎదుట నిరసన తెలపడంతో పాటు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్‌ చేశారు. సభలో జగన్ తీరుపై.. పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.ప్రతిపక్ష హోదా రాదని ఫిక్స్ అవ్వాలంటూ చుకరలు అంటించారు. దీనిపై వైసీపీ రియాక్ట్ అవగా.. శాసనసభ వేదికగా పవన్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల తీరు చూస్తే టెర్రరిజం గుర్తుకు వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరెత్తి చెప్పకపోయినా.. వైసీపీ ప్రతీ మాటకు కౌంటర్ ఇచ్చారు. పవన్ మాటలు.. ఫ్యాన్ పార్టీకి తగలాల్సినచోట తగినట్లు అనిపించాయ్‌.వైసీపీ చేసిన రచ్చకు తాను క్షమాపణ చెప్తున్నానంటూ.. ఫ్యాన్ పార్టీని దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్. ఇది రాజకీయంగా జనసేనకు కలిసివచ్చే అవకాశాలు లేకపోలేదు. కూటమి విషయంలో స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
పదేళ్లు కూటమిగానే ఉంటాం.. అధికారం తమదే అన్న పవన్ ఇప్పుడు మరో ఐదేళ్లు పెంచారు.కూటమి ప్రభుత్వం 15ఏళ్లు కొనసాగుతుందని చెప్పారు. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని.. ఏదీ పట్టించుకోమని అన్నారు. కూటమిలో లుకలుకలు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. కలిసే ఉంటామని కూటమిని నిలబెడతామని హామీ ఇచ్చారు.వైసీపీ విషయంలో ఎప్పటికీ తగ్గేదే లే అన్నట్లు పవన్ మాటలు వినిపించాయ్. ఎన్నికల ప్రచారంలో వైసీపీని నిలదీసిన పవన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ప్రజావేదికల కూల్చివేతల నుంచి.. అమరావతి రైతులపై దాడు, చంద్రబాబు జైలు, కల్తీ లడ్డూ వరకు ప్రతీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఫ్యాన్‌ పార్టీని ఓ ఆట ఆడుకున్నారు పవన్ కల్యాణ్‌.వైసీపీ విషయంలో ఏ విషయం మర్చిపోయేది లేదని.. అన్నింటినీ నిలదీస్తాం, కడిగేస్తాం అన్నట్లుగా కనిపిస్తున్నారు. రాజకీయ వైరం మాత్రమే కాదు.. అంతకుమించి అన్నట్లుగా వైసీపీ మీద పవన్ యుద్ధం చేస్తున్నారా అనిపిస్తోంది కొన్నిసార్లు ! చంద్రబాబు అయినా వైసీపీ విషయంలో అంతో ఇంతో మౌనం వహిస్తున్నారేమో కానీ.. పవన్ మాత్రం అలా కనిపించడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్