సీనియర్ సిటిజెన్లకు అన్ని విధాలుగా అండగా ఉంటా
ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
2024 సం.. డైరీలు,
క్యాలెండర్లను,సీనియర్ సిటిజెన్ల పిలుపు అనే ప్రత్యేక పత్రికలు ఆవిష్కరణ
కోరుట్ల
సీనియర్ సిటీజేన్లకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం కోరుట్ల పట్టణంలో తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ కార్యలయమును ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం అసోసియేషన్ 2024 సంవత్సరం డైరీలు,
క్యాలెండర్లను,సీనియర్ సిటిజెన్ల పిలుపు అనే ప్రత్యేక పత్రికలను ,ఎమ్మెల్యే సంజయ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు,కౌన్సెలింగ్ అధికారి పబ్బా శివానందం ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా,డివిజన్,మండల,పట్టణ,గ్రామాల ప్రతినిధులు కోరుట్ల ఎమ్మెల్యే ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.. .ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి దశ,మలి దశ ఉద్యమాల్లో కేసీఆర్ తో వెంట నడిచిన సీనియర్ సిటిజెన్లకు తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తన పదవీకాలంలో అన్నివిధాలా అండగా ఉన్నారన్నారు.తాను సైతం సీనియర్ సిటీజేన్స్ ఏ సహాయం కోరినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఆదుకుంటామన్నారు.సీనియర్ సిటీజేన్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు, రాష్ట్ర కార్యదర్శి ,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,సంఘ ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి జి.రాజ్ మోహన్,ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్దీన్ ,కోశాధికారి ఎన్ .లక్ష్మీ నారాయణ,
కథలాపూర్ మండల అధ్యక్షుడు అల్లూరి బాపు రెడ్డి,మేడిపల్లి మండల అధ్యక్షుడు ఒద్దినేని గోవర్ధన్ రావు, జిల్లా,డివిజన్ నాయకులు రాజయ్య,లక్ష్మీ కాంతం,డివిజన్,
మండలాల,పట్టణ , ప్రతినిధులు పాల్గొన్నారు.