పెరమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

- Advertisement -

పెరమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు*

Sensational court verdict in Peramalla Pranay murder case
Sensational court verdict in Peramalla Pranay murder case
Sensational court verdict in Peramalla Pranay murder case

హైదరాబాద్:మార్చి 10 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరమాళ్ళ ప్రణయ్, హత్య కేసులో తుది తీర్పు ఇవాళ సోమవారం నల్గొండ కోర్టు వెల్లడించింది A 2, ముద్దాయి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయ స్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇస్తూ మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు అనే వ్యక్తి 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో యువకుడు ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేసి, 8 మందిని నిందితులుగా పేర్కొంటూ న్యాయస్థానం లో 2019లో ఛార్జిషీట్​ దాఖలు చేశారు. 6 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగగా, ఇటీవలే వాదనలు ముగిశాయి. ప్రణయ్‌ హత్య కేసులో ఏ1గా ఉన్న నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో ఏ2 సుభాష్‌ కుమార్‌ శర్మ, ఏ3 అస్గర్‌అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌ శర్మకు బెయిల్‌ రాకపోవడంతో జైళ్లోనే ఉండగా, అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నా డు. మిగిలిన వారందరూ బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అనారోగ్య సమ స్యలు ఉన్నాయని, తమపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లల కోసం శిక్ష తగ్గించా లని నిందితులు న్యాయ స్థానాన్ని వేడుకున్నారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular