హైదరాబాద్, అక్టోబరు 26, (వాయిస్ టుడే): తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఎలక్షన్ హీట్ పెరిగిపోతోంది… హ్యాట్రిక్ లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు … అటు కాంగ్రెస్ ఈ సారి గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉంది … బీజేపీ సైతం ముందుకు వస్తోంది… ఆ క్రమంలో కేసీఆర్ ప్రచారవ్యూహాలకు పదును పెడుతూ… విస్తృత ప్రచారం మొదలెట్టేశారు .. అందులో భాగంగా గులాబీబాస్ తిరిగి సెంటిమెంట్ ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు .. ముఖ్యంగా కొత్త ఓటర్లు, మహిళలే టార్గెట్ గా ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయి… అసలు కేసీఆర్ తాజా వ్యూహమేంటి?
వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ ద్విముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది … ఎవరు కాదన్నా కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటితో పాటు లేటెస్టె హ్యానిఫెస్టోలో ఇచ్చిన సరికొత్త హామీలు ఇంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్న టాక్ ఉంది .. తాను అమలు చేస్తున్న సంక్షేమాన్ని కొనసాగిస్తూనే .. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా కొత్త పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నారు..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఎందుకు అవసరమో ప్రజలను జాగృతం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తన పాలనలో .. సంక్షేమం, అభివృద్ధిలను జోడెద్దులుగా గుర్తించి ముందుకు సాగుతున్నారు … తెలంగాణ నాడి, వాడీవేడి తెలిసిన జననేత కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ప్రకటించిన మేనిఫేస్టో తెలంగాణ రూపురేఖలను మార్చేలా ఉందని పొలిటికల్ విశ్లేషకులు, విమర్శకులు ఘంటాపథంగా చెబుతున్నారు …. మానవ వనరుల అభివృద్దికి ఖర్చు చేసే ప్రతీపైసా తిరిగి సమాజానికి పెట్టుబడిగా రూపాంతరం చెందుతుందని బలంగా నమ్ముతున్నారు … విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, కూడు, గూడు వంటి కనీస అవసరాలకు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఆసరా ఇస్తుందని ఆయా వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి తగ్గట్లుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉందనే టాక్ వినిపిస్తోంది.
సెంటిమెంట్ తో హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన గులాబీ బాస్ వరుస సభలతో నియోజకవర్గాలను చుట్టేయడం మొదలెట్టేశారు … కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు సాధ్యాసాధ్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది …. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కష్టసాధ్యమేనని ఆర్ధిక వర్గాలు చెబుతున్నాయి… ఈ పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే పెన్షన్ ల మొత్తాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ అధినేత చేసిన సాహసమే అని చెప్పాలి .. అదే క్రమంలో రైతు బంధు పెంపు..రైతు రుణ మాఫీ , రూ.400లకే వంట గ్యాస్ సిలిండర్ వంటి హామీలతో ఎన్నికలకు ముందే జనహృదయాల్ని దోచేశారు కేసీఆర్.. మరి బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ , బీజేపీలు గులాబీ పార్టీకి ఎలా చెక్ పెడతాయో చూడాలి.