బాధితులకు నష్టపరిహారం ఇచ్చేదెప్పుడు…
నిత్యవసర సరుకులు బూడిద…
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్. బి ఆర్ ఎస్ ఆపధర్మ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరామర్శ
రంగారెడ్డి అక్టోబర్ 28 వాయిస్ టుడే ప్రతినిధి: శనివారం తెల్లవారుజామున దాదాపు రెండు గంటల ప్రాంతంలో శేరిలింగంపల్లి కూరగాయల మార్కెట్ దుకాణాలు అభివృద్ధి అహుతి అయ్యాయి. మార్కెట్లో నిత్యవసర సరుకులు ఖాళీ బూడిద కాగా వాటి అంచనా లక్షల్లో ఉంటుందని విక్రయదారులు వాపోతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి తీవ్ర కృషి చేసిన ఫలితం లేకపోయింది. కొంతమంది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని చెబుతున్నారు. మరికొంతమంది ఎలా జరిగిందో తెలియడం లేదని మరి చెబుతున్నారు. ఏది ఏమైనా వస్తువులు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాయి. వీటిని పరామర్శించడానికి బి ఆర్ ఎస్ ఆపద్ధర్మ మాజీ ఎమ్మెల్యే గాంధీ పరామర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో మార్కెట్ ను స్లాబ్ తో ఏర్పాటు చేయాలని అనుకున్నామని ఇతరులకు కొన్ని ఆటంకములు కలగవచ్చని అందుకే ఇలాగే కొనసాగాలని నిర్ణయించుకున్నామని విక్రయదారులతో మాట్లాడారు. ఏది ఏమైనా దుకాణ యజమానులకు హామీ ఇచ్చిన మాటలు నీటి మూటల పాలు కాకుండా వారం రోజులలో దుకాణ సముదాయాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని దుకాణదారులు కోరుతున్నారు. శేరిలింగంపల్లి కూరగాయల మార్కెట్ కొనుగోలుదారులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. మూత్రశాలలో ఉన్న ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని ప్రజలు తెలిపారు. అతిపెద్ద నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లి కూరగాయల మార్కెట్ ను ఎంత అభివృద్ధి చేసినా తక్కువేనని విక్రయ దారులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ సంఘటన స్థలానికి వచ్చి దుకాణదారుల దగ్గర అన్ని విషయాలు తెలుసుకుని మీ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.దాంతో విక్రయదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ప్రజలను వెంటనే కాపాడాలని. అలాగే నష్టపరిహారం ఇప్పించాలని విక్రయదారులతోపాటు. శేరిలింగంపల్లి ప్రజలు డిమాండ్ చేశారు



