Tuesday, March 17, 2026

ఆరోగ్య మహిళ  సేవలను వినియోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ

- Advertisement -

ఆరోగ్య మహిళ  సేవలను వినియోగించుకోవాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతీ

Services of health woman should be availed-District Collector Pamela Satpathy

కరీంనగర్
చిన్న ములకలూరులో శుక్రవారం సభ
ప్రతి మహిళ స్థానికంగా ఉన్న ఆరోగ్య మహిళ క్లినిక్ కి వెళ్లి సుమారు 50 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు రక్తహీనతకు గురి కాకుండా సమతుల ఆహారం, ఐరన్, క్యాల్షియం మాత్రలు  తీసుకోవాలని సూచించారు. గర్భిణీగా ఉన్నప్పుడు నాలుగు వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రులలో గర్భిణీలకు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. శిశువులకు ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు ఇవ్వాలని, నీరు, తేనే వంటివి ఇవ్వవద్దని తెలిపారు. అంగన్వాడి కేంద్రాలలో ఇంగ్లీష్ మీడియం తో కూడిన ప్రాథమిక విద్యను అందిస్తున్నారని, ఆరు సంవత్సరాల లోపు పిల్లల్ని అంగన్వాడికి పంపాలని కోరారు. 45 వేల రూపాయలు ఖర్చయ్యే పరీక్షలను ఆరోగ్య మహిళా క్లినిక్ లలో ఉచితంగా చేయిస్తున్నామని, ఈ పరీక్షల్లో క్యాన్సర్ వ్యాధులను కూడా ముందస్తుగా గుర్తిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రతి మహిళ మూడు నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, సీడీపీవో శ్రీమతి, ఎంపిడిఓ ఖాజా మోహినుద్దీన్, తహసీల్దార్ రమేష్ , ఎంపీడీవో రాజశేఖర్ రెడ్డి, పల్లె దవాఖాన వైద్యురాలు మాధురి, డిసిపిఓ శాంత, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, పోషణ అభియాన్  కోఆర్డినేటర్ నాగరాజు, డిహెచ్ ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్