తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంక్చర్ కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న ఓ టూరిస్ట్ వ్యాన్ ను.. వెనుక నుంచి వచ్చి మినీ లారీ ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడే నిల్చున్నవారిలో ఏడుగురు మహిళలు మరణించారు. ఒనన్ గుట్టై గ్రామానికి చెందిన 45 మంది.. రెండు వ్యాన్లలో కర్ణాటకలోని ధర్మస్థలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తిరుపత్తూర్ లో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై టైర్ పంక్చర్ కాగా… డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. ఆ సమయంలో ప్రయాణికులు రోడ్డు పక్కన వ్యాన్ దగ్గర నిల్చొని ఉండగా… మినీ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించగా…. గాయపడిన డ్రైవర్, క్లీనర్ సహా 10 మందిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనను చూసిన ఇతర వాహనదారులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.