- Advertisement -
బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం
Severe cyclone strengthened in Bay of Bengalవిశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరీకి 70 కిలోమీ టర్లు, గోపాలపూర్కు 140కి.మీ కళింగపట్నం కు 240 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర, వాయవ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలోని పూరీ-పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని డేగ అల మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వ తీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా యని తెలిపింది.
- Advertisement -




