Sunday, February 15, 2026

మంథనిలో ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ పాఠశాల బంద్ విజయవంతం

- Advertisement -

మంథనిలో ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ పాఠశాల బంద్ విజయవంతం

SFI government school bandh successful in Manthani

మంథని

ప్రభుత్వ పాఠశాలలోని  సమస్యలను పరిష్కరించాలని, మధ్యాహ్న భోజన  ఫుడ్ పాయిజన్ కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ మంథని మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మంథని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల లకు వెళ్లి బందు చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనంలో అనేకమంది విద్యార్థులు అనారోగ్యాల గురైన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం  విద్యాశాఖ మంత్రి నియమించాలని ఎస్.ఎఫ్.ఐ రక్షణ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.  త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్స్ లలో, గురుకుల పాఠశాలలో, చదువును కొనసాగిస్తున్నారని వీరికి రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తున్న విద్యార్థులు పౌష్టికంగా ఉండాలని ప్రైవేటు పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ర్యాంకులు తీసుకురావాలని ప్రభుత్వాలు  హామీలను ఇస్తున్నాయి. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం లోపం ఉండడం వల్ల కలుషితం అవ్వడం వల్ల  అనేకమంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని అన్నారు.    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం  గడిచిపోతున్న ఇప్పటివరకు విద్యా శాఖ మంత్రి నియమించలేదని,విద్యా సంస్థల పైన పర్యవేక్షణ లేదని జిల్లావ్యాప్తంగా ఎంఈఓ పోస్టులు డివో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అసలే లేవు విద్యార్థి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతోనే ప్రజల్ని పక్కదో పటించడం అనేది సరైనది కాదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ కారకులను శిక్షించాలని  ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గల కారణాలను బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ  మండల ప్రధాన కార్యదర్శి బందెల రాజకుమార్, నాయకులు దేవేందర్,సురేష్, రవి,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్