సత్యం రాజేష్ నటించిన మావూరి పొలిమేర 1 – డిస్నీహాట్ స్టార్ – ఓటీటీ లోకి చాలా చిన్న సినిమా గా వచ్చింది – కానీ, కధ, కధనం తో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
పార్ట్ 1 లో క్లైమాక్స్ లో, పోయాడనుకున్న హీరోక్యారెక్టర్ ‘కొమరయ్య'(సత్యం రాజేష్) ఎక్కడో కేరళ లో తన లవర్ తో ఉండడం అనేది, ప్రేక్షకుడు అస్సలు ఊహించని ట్విస్ట్.
ఆ సస్పెన్సు మీద బేస్ చేసుకుని, కథను నమ్మి, వస్తోన్న సినిమానే ఈ మావూరి పొలిమేర పార్ట్ 2. కాకపోతే ఈ రెండవ భాగం థియేటర్స్ లోనే రిలీజ్ అవుతోంది.
ఎక్కడైతే పార్ట్ 1 ముగిసిందో.. పార్ట్ 2 అక్కడే మొదలవుతుంది. : డా.అనిల్ విశ్వనాథ్
పొలిమేర సినిమా లకి డా. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించారు.
పొలిమేర 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధు లుగా హీరో అడివి శేష్, బేబీ ప్రొడ్యూసర్ – ఎస్కెయేన్ హాజరై, పొలిమేర 2 మంచి విజయం సాధించాలని విషెస్ తెలిపారు.
అడివి శేష్ మాట్లాడుతూ, డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్ తో తన పరిచయం తన టూ స్టేట్స్, కర్మ సినిమాలనుంచి ఉందని, అలాగే, సత్యం రాజేష్, తన కెరీర్ బిగినింగ్ లో, మొదటి సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చాడని, ఈ ఫంక్షన్ కి రావడం అనేది, తన కి హోమ్ కమింగ్ లా ఉందని, పొలిమేర డైరెక్టర్, యాక్టర్స్, టెక్నీషియన్స్ తో తనకున్న రాపో ని గుర్తు చేసుకుని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని చెప్పారు.
స్వతహగా డెంటిస్ట్ అయిన డా. అనిల్ విశ్వనాధ్ డైరెక్ట్ చేయగా, బ్లాక్ మేజిక్, చేతబడి, బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ పొలిమేర 2 లో, సత్యం రాజేష్ హీరో గా నటించగా, మరో డెంటిస్ట్- డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా ను, ఇతర పాత్రల్లో, బాలాదిత్య, చిత్రం శ్రీను, గేటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, సాహితి దాసరి నటించారు.
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ – గ్యాని మంచి బాక్గ్రౌండ్ సంగీతాన్ని అందించారాని టీజర్ చుస్తే తెలుస్తోంది.
పొలిమేర 2 టీజర్ చుస్తే, ఖచ్చితంగా మొదటి భాగం కన్నా ఇది ఇంకా సస్పెన్సు, ట్విస్టులతో అలరిస్తుందని చెప్పొచ్చు.
డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాధ్ మాట్లాడుతూ, ఈ పొలిమేర 2, ప్రేక్షకుల్ని, ఆనందింప చేస్తుందని, మొదటి పార్ట్ కన్నా ఎక్కువ ట్విస్టులు ఉంటాయని చెబుతూ, పొలిమేర 3 కూడా ఉంటుందని, అంతేకాక, పొలిమేర ఫ్రాంచైజీ సినిమాలు చేస్తామని,చెప్పారు
గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన, వంశీ నందివాడ, ఈ పొలిమేర 2, నవంబర్ 3 న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు – సత్య కేశరాజు