- Advertisement -
నా తల్లిని అవమానపరుస్తారా?: బండి సంజయ్పై మంత్రి పొన్నం ఆగ్రహం
హైదరాబాద్: భాజపా ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని (Ponnam prabhakar) అన్నారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
“ఎంపీగా తెలంగాణ, హుస్నాబాద్కు ఏం చేశావని ప్రశ్నిస్తే నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతారా? బతికున్న ఆమెను అవమానపరుస్తారా? మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. నా దయాదాక్షిణ్యాల మీద అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యావు.. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావా?.. జాగ్రత్త!” అని బండి సంజయ్ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -