ధర్నా చౌక్ ఎత్తేసినోళ్లే ధర్నాలా సిగ్గు… సిగ్గు…
— అక్రమ నిర్మాణదారులే ధర్నాలు చేయడం విడ్డూరం
— బిఆర్ఎస్ నేతల ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు
— కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
కూకట్ పల్లి : మార్చి 6(వాయిస్ టుడే)
ధర్నా చౌక్ ఎత్తేసినోల్లే ఎల్ ఆర్ ఎస్ ల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి విమర్శించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు బుధవారం కూకట్ పల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించేవారు, నిర్మాణాల వద్ద డబ్బులు వసూలు చేసే వారే ధర్నా చేయడం దురదృష్టకరమన్నారు. ధర్నా చౌక్ ఎత్తేసి ధర్నాలనే నిషేధించిన బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ధర్నా చేస్తుంటే ప్రజలు పెదవి విరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ధర్నాలు ఉండవు అన్న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ధర్నా చౌక్ తొలగించి ధర్నాలను నిషేధించింది. నిరసన తెలిపే వాళ్లపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలను కొనసాగించింది గత ప్రభుత్వం. కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే తమది ఫక్తు రాజకీయ పార్టీ అంటూ ఇతర పార్టీ నేతలను బిఆర్ఎస్ లోకి తీసుకొని ఉద్యమకారులను అణచివేశారు. అయితే ఒక్కసారిగా పరాజయ పాలు కావడంతో బిఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కొత్త పాట అందుకొని ధర్నాలకు పిలుపునిచ్చిందని, టిఆర్ఎస్ నేతల ధర్నా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచితంగా విమర్శలు చేస్తూ నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిరసనలు ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి తెలిపారు.