Sunday, September 8, 2024

ఎస్‌బీఐ ఆల్ టైమ్ హై కి దూసుకెళ్లిన షేర్లు!

- Advertisement -

ఎస్‌బీఐ మరో ఘనత.. ఏకంగా రూ. 6 లక్షల కోట్ల విలువ.. ఆల్ టైమ్ హై కి దూసుకెళ్లిన షేర్లు!

ప్రభుత్వ రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో ఘనత సాధించింది. ఇటీవలి కాలంలో షేరు విలువ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. బుధవారం సెషన్‌లో కూడా 4 శాతానికిపైగా పెరిగి జీవన కాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక మార్కెట్ విలువ రూ. 6 లక్షల కోట్లు దాటడం విశేషం.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఒడుదొడుకుల నడుమ ట్రేడయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 30 పాయింట్లకుపైగా పడిపోయి 72,152 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ మాత్రం ఫ్లాట్‌గా 21,930 వద్ద సెషన్ ముగించించి. మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ట్రేడయినప్పటికీ కొన్ని హెవీ వెయిట్ షేర్లు మాత్రం దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఎస్‌‌బీఐ మరో రికార్డు సృష్టించింది. ఇవాళ షేరు ధర రికార్డు స్థాయిలో పెరగ్గా.. మార్కెట్ విలువ రూ. 6 లక్షల కోట్లు దాటేసింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ ఎం-క్యాప్ రూ. 6.03 లక్షల కోట్లుగా ఉంది
బుధవారం సెషన్ ఆరంభం నుంచి సానుకూలంగా కదలాడిన ఎస్‌బీఐ షేరు చివరికి 4.19 శాతం లాభంతో రూ. 677.50 వద్ద సెషన్ ముగించింది. అంతకుముందు రూ. 677.95 వద్ద 52 వారాల గరిష్ట విలువను నమోదు చేసింది. కిందటి సెషన్‌లో రూ. 650.25 వద్ద క్లోజ్ అయిన ఈ షేరు ఇవాళ పుంజుకుంది. ఇక ఈ క్రమంలోనే మార్కెట్ విలువ కూడా పెరిగింది.
కేంద్ర ప్రభుత్వ రంగాలకు చెందిన కంపెనీల్లో రూ. 6 లక్షల కోట్ల మార్క్ దాటిన రెండో సంస్థ ఎస్‌బీఐ. అంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ఈ మార్క్ అధిగమించింది. ఈ స్టాక్ కూడా కొంతకాలంగా పుంజుకుంటూ రికార్డు గరిష్టాలకు తాకుతూనే ఉంది. ఇవాళ కూడా 2.34 శాతం పెరిగి రూ. 1049.90 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.1050 వద్ద ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ. 6.60 లక్షల కోట్లుగా ఉంది
ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో చేసిన ప్రకటన తర్వాత ప్రభుత్వ బ్యాంకింగ్ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం పూడ్చుకునేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024-25) రూ. 14.13 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలని ప్రతిపాదించారు నిర్మలమ్మ. దీంతో ప్రభుత్వ బాండ్ల వాటా ఎక్కువగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఊతమిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ బ్యాంకింగ్ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ షేరు కూడా రికార్డు గరిష్టాల్ని తాకుతోంది.

ఎస్‌బీఐ ఇటీవల Q3 ఫలితాల్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే నికర లాభం 35.50 శాతం తగ్గి రూ. 9164 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో స్వల్ప వృద్ధి కనిపించింది. అయినా బడ్జెట్ ప్రకటనలతో పలు బ్రోకరేజీలు కూడా ఎస్‌బీఐ స్టాక్‌క బై రేటింగ్ ఇచ్చాయి. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ.. ఎస్‌బీఐ టార్గెట్ ప్రైస్‌ను రూ. 800 గా అంచనా వేసింది. ఫిలిప్ క్యాపిటల్ మాత్రం రూ. 660 నుంచి టార్గెట్ ప్రైస్‌ను రూ. 720కి పెంచింది. సిస్టమేటిక్స్ దీని టార్గెట్ ప్రైస్ గతంలో రూ. 692 గా ఉండగా.. రూ. 770 కి పెంచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్