Sunday, September 8, 2024

పోలీసులకు హారతి పట్టిన షర్మిల

- Advertisement -

షర్మిల ను అడ్డుకున్న పోలీసులు

Sharmila was arrested by the police
Sharmila was arrested by the police

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రెడ్డి తలపెట్టిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గం పర్యటన  రద్దయింది.  శుక్రవారం నాడు జగదేవ్ పూర్ మండలం, తీగుల్ గ్రామంలో పర్యటించాల్సి వుంది. అయితే , ఉదయం 9 గంటలకు లోటస్ పాండ్ నివాసం నుంచి బయలు దేరటానికి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దళిత బందు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామంలో  స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో లోటస్ పాండ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులతో వైఎస్ షర్మిల  వాగ్వాదానికి దిగారు. తన పర్యటనకు అనుమతి ఇవ్వనందుకు నిరసనగా పోలీసులకు హారతి పట్టారు. సిఎం కేసీఆర్ తీరుకు నిరసన గా సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్