Friday, October 18, 2024

షర్మిల దూకుడు…

- Advertisement -

షర్మిల దూకుడు…
విజయవాడ, ఫిబ్రవరి 13
ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఇదివరకే ఆరు ఇంఛార్జ్ ల జాబితాలను విడుదల చేసింది. కొన్నిచోట్ల అభ్యర్థులను మార్చగా, మరికొన్ని చోట్ల ఎంపీలకు ఎమ్మెల్యేలుగా, అసెంబ్లీ వెళ్లే వారిని లోక్‌సభకు పంపాలని జగన్ ప్లాన్ చేశారు. సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ సైతం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేసింది. వైఎస్ షర్మిల చేరికతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అందులోనూ ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించడం పార్టీ కేడర్ లోనూ జోష్ తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్ హైకమాండ్ నేడు ఏపీ ఎన్నికల కమిటీనిప్రకటించింది. ఈ కమిటీకి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పళ్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజు, శైలజానాథ్, చింతా మోహన్, తులసి రెడ్డి, జేడీ శీలం సహా మొత్తం 20 మంది సీనియర్లకు చోటు దక్కింది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.మరోవైపు ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో షర్మిల తీరక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణలో నియంతను గద్దె దింపానని, ఇక ఏపీలోనూ నియంతను గద్దె దింపడమే తన ముందున్న లక్ష్యమని షర్మిల చెబుతున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ షర్మిల దూసుకెళ్తున్నారు. ప్రత్యేక హోదా అంశం, విభజన చట్టం హామీలు.. లాంటి కీలక అంశాలను షర్మిల పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాక తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనే చేస్తానని మాటిచ్చారని షర్మిల స్పష్టం చేశారు. మరో వైపు
పీసీసీ  ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు శనివారంతో ముగియగా.. ఈ నెల 29 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటివరకూ 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. గడువు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజులు సమయం ఇస్తున్నట్లు ఏపీసీసీ ప్రకటించింది. అయితే, ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. కాగా, ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది ఆశావహులు పోటీ పడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అటు, తెలంగాణలోనూ ఎంపీ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఇటీవలే ముగిసింది. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఆక్రమాస్తుల కేసు FIRలో వైఎస్సార్ పేరు చేర్చడం కాంగ్రెస్ పార్టీ కావాలని చేసిన తప్పు కాదని.. అది తెలియక చేసిన పొరపాటే అని స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే గాంధీ కుటుంభానికి ఇప్పటికీ మమకారం ఉందని.. వైఎస్సార్ అంటే సోనియాకి గౌరవం అని పేర్కొన్నారు. తన మనసు నమ్మింది కాబట్టే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఏ మాత్రం మోసం చేయలేదని  స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియంత పాలన తరిమికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. ‘సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారు. వైసీపీ, తెలుగుదేశం రెండూ బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. ప్రజల పక్షాన నిలబడని పాలక పక్షం మనకు వద్దు.’ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్