మహిళల, బాలికల రక్షణ కోసమే షీ టీమ్
మహిళల భద్రత రక్షణ కి షీ టీమ్స్ తో మరింత భరోసా
మహిళలు ఆపదలో జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670783 ఫిర్యాదు చేయవచ్చు
కోరుట్ల
ఎస్సై -II శ్వేత
జగిత్యాల,
మహిళలు ,బాలికలు విద్యార్థినిలు వేధింపులకు గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670783 కు
లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేసినచో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని
కొరుట్ల
ఎస్సై -II శ్వేత ఆన్నారు.శుక్రవారం
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షీ టీం,ఏహెచ్టీయూ టీమ్, కళాబృందం, భరోస సెంటర్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా కొరుట్ల
ఎస్సై -II శ్వేత మాట్లాడుతూ మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్,
ఏహెచ్టీయూ టీమ్, కళాబృందం, భరోస సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు వీటి ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు. షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని లేదా 8712670783 వాట్సప్ ద్వారా కూడా పిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురి అయినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఇరుగుపొరుగు వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఆపదలో ఉన్న మహిళలు బాలికలు విద్యార్థిని విద్యార్థులు వెంటనే జిల్లా షీ టీం ఫోన్ నెంబర్ 8712670783 కి కాల్ చేసిన కాని, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి వెంటనే షీ టీమ్స్ సహాయం పొదలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వాసవి,ఏ ఎస్సై వలీ బెగ్, ఉమెన్ కానిస్టేబుల్ లు సౌజన్య , పూజిత, మంజుల, లెక్చరర్స్ విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు