- Advertisement -
విద్యార్థులకు మహిళల భద్రతపై, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన షి టీం
She team made students aware of women's safety and online fraud
మంథని
మంథని మండలం ఆరెంద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు షి టీం ఇంచార్జ్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ తోపాటు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో షి టీం సభ్యుడు సురేష్, హెడ్ మాస్టర్ శ్రీలత ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -