మహిళల రక్షణ కోసమే షీ టీమ్లు.

- Advertisement -

 మహిళల రక్షణ కోసమే షీ టీమ్లు.

She teams for the protection of women.

కమాన్ పూర్
మహిళల భద్రత కోసమే షి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని షీ టీమ్ ఇన్చార్జ్  ఏఎస్ఐ మల్లన్న  అన్నారు. పెద్దపల్లి లోని గాయత్రి ఇంటర్  మిడియాట్ కాలేజి విద్యార్థులకు భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ మరియు ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు  ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని అన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది స్నేహలత , సురేష్ తో పాటు విద్యార్థులు మరియు కాలేజీ ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular