Thursday, January 9, 2025

శివంగిలా…సుశీలా

- Advertisement -

శివంగిలా…సుశీలా

Shivangila...Susheela

జైపూర్, జనవరి 9, (వాయిస్ టుడే)
శివంగిలాగా బౌలింగ్ చేసే ఆ బాలిక పేరు సుశీలా మీనా ఈమె టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా దిగ్గజ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వెలుగులోకి తెచ్చాడు. దీంతో ఆనాటి నుంచి సుశీలా మీనా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ అయింది. ఈమె గురించి చాలామంది ఆరా తీయడం మొదలుపెట్టారు. అలా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రంలో పేద కుటుంబంలో జన్మించింది. అయినప్పటికీ క్రికెట్ మీద ఆమెకు విపరీతమైన ఇష్టం. అందువల్లే అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో తన టాలెంట్ ను నిరూపించుకుంది. అయితే ఆ అమ్మాయి చేస్తున్న బౌలింగ్ సచిన్ టెండూల్కర్ కు ఆసక్తి కలిగించింది. అందువల్లే ఆమె బౌలింగ్ చేస్తున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్త మిలియన్ వ్యూస్ సొంతం చేసుకు. దీంతో ఒక్కసారిగా ఆమె గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలో సుశీల తో సరదాగా క్రికెట్ ఆడారు. సుశీల వేసిన ఒక బంతి రాజ వర్ధన్ సింగ్ రాథోడ్ బ్యాట్ మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను పడగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో పెను సంచలనంగా మారింది.సుశీలలో ఉన్న ప్రతిను చూసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్( ఆమెకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి అయ్యే ఖర్చును మొత్తం రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ భరిస్తోంది. సుశీలలో అద్భుతమైన ప్రతిభ ఉందని.. ఆ ప్రతిభకు సరైన శిక్షణ తోడైతే ఆమె అద్భుతంగా రాణిస్తుందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ” సుశీల వయసు చిన్నదే. అయినప్పటికీ ఆమె బౌలింగ్ వేసే విధానం అద్భుతం. అందువల్లే సచిన్ టెండూల్కర్ మనసును చూరగొన్నది. తన ఏకంగా ఆమె వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె బౌలింగ్ వేసే విధానం ఎంత నచ్చితే సచిన్ ఆ పని చేశారో అర్థం చేసుకోవచ్చు. సుశీలకు ఇదేవిధంగా ట్రైనింగ్ ఇస్తే ఆమె భవిష్యత్ కాలంలో టీమిండియా మహిళల జట్టును కచ్చితంగా లీడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆమె మట్టిలో పుట్టిన మాణిక్యం. కచ్చితంగా క్రికెట్ కు సరికొత్త సొబగులు అద్దుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని” మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.రాజస్థాన్ బాలిక సుశీల మీనా.. అచ్చం జహీర్ ఖాన్ మాదిరిగా బౌలింగ్ వేస్తూ అదరగొడుతోంది. గతంలో ఈమె టాలెంట్ ను సచిన్ బయటపెట్టాడు. తాజాగా ఈ బాలిక బౌలింగ్లో కేంద్రమంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్