చంద్రబాబుకు షాక్

- Advertisement -

విజయవాడ, అక్టోబరు 12: ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలని జడ్జి ఆదేశించారు. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పులు వస్తే జోక్యం చేసుకోవచ్చని చంద్రబాబు లాయర్లకు ఏసీబీ కోర్టు సూచించింది. పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ – Prisoner in Transit). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరతారు. అప్పుడు కోర్టు పీటీ వారెంట్ ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జైలులో ఉన్న ఖైదీని మరో చోటికి తరలించడం. సీఆర్పీసీలోని సెక్షన్ 269 కింద కోర్టు పీటీ వారెంట్‌ని ఇస్తుంది

Shock for Chandrababu
Shock for Chandrababu
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular