మందుబాబులకు షాక్.. రేపు మద్యం దుకాణాలు బంద్..

- Advertisement -

మందుబాబులకు షాక్.. రేపు మద్యం దుకాణాలు బంద్..

Shock for drug addicts.. Liquor shops to be closed tomorrow..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది దసరా పండుగలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. దసరా పండుగ రోజే గాంధీ జయంతి రావడంతో.. రాష్ట్ర ప్రజలు తర్జనభర్జనలో పడ్డారు. రేపు(గురువారం) గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసం దుకాణాలు మూసివేస్తారు. దీంతో ఇప్పటి నుంచే షాపుల ముందు ప్రజలు బారులు తీరారు.

రేపు(గురువారం) హైదరాబాద్ నగరవ్యాప్తంగా మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. గాంధీ జయంతి ఎఫెక్ట్‌తో.. నిన్న(మంగళవారం) ఒక్కరోజే రూ. 270 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ(బుధవారం) రూ. 300 కోట్ల సేల్స్ పెరగవచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం వ్యాపారులు భారీ స్టాక్‌‌తో సేల్స్‌కు రెడీ అయ్యారు. దీంతో వైన్ షాపులు, లిక్కర్ మార్ట్ మందుబాబులు కోలాహలం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో నిలబడి మద్యం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న మందుబాబులే కనిపిస్తున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular