24న విద్యాసంస్థల బంద్..
.
వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు పిలుపు
Shutdown of educational institutions on the 24th…
ఎమ్మిగనూరు
నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మహేంద్ర బాబు,ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు గఫూర్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి దేవా,ఎన్.ఎస్.యు.ఐ పట్టణ కార్యదర్శి కుమార్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్ష పేపర్లు లీకేజీ అయ్యాయి. నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ కి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని గత నెల రోజులుగా ఆందోళన దేశ వ్యాప్తంగా జరుగుతున్న, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర 21 రోజులుగా సోనం వాంగు చుక్ ఆమరణ దీక్ష చేపట్టారని కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అక్రమంగా అరెస్టు చేసి హాస్పటల్ కు తరలించడం జరిగింది. అయినా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మొన్న లక్షలాది మంది విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్య వ్యవస్థను పరిరక్షించడం కోసం కదం తొక్కారు కానీ వేలాది మంది విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ పోలీసులతో లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగం చేయడం అక్రమ అరెస్టులకు పాల్పడిన మోడీ ప్రభుత్వం అలా వ్యవహరించడం హేయమైన చర్య అని అన్నారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలని నీట్ పరీక్ష విధానం రద్దుచేసి రాష్ట్రాల వారిగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ, నీట్ తదితర పరీక్ష పత్రాల లీకేజ్ పై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరుతూ 24వ తేదీన వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ చేయాలని కోరారు. ఈ బంద్ కు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వ,ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యజమాన్యం సహకరించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు నరసింహ రెడ్డి,సుధాకర్,ప్రతాప్, సలాం బాషా, రవి, వీరేష్, రాఘవేంద్ర, లక్ష్మన్న, రామాంజిని, రఘు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు.




