సివిల్ కేటగిరి జోన్ 7 జోగులంబ పరిధిలో జనరల్ women కేటగిరీలో B.తారక యాదవ్

మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం అడ్డకల్ మండలం లోని బలీదుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ, వెంకటేష్ (గ్రామ పంచాయతీ డ్రైవర్) గారి కూతురు…. B. తారక యాదవ్ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన SI ఫలితాలలో సివిల్ కేటగిరి జోన్ 7 జోగులంబ పరిధిలో జనరల్ women కేటగిరీలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం జరిగింది, పేద కుటుంబం లో పుట్టి గొప్పగా చదివి తల్లి దండ్రులకు,కుటుంబ సభ్యులకు ఊరికి పేరు తెచ్చిన మా కుతురు తారక యాదవ్ ను కుటుంబ సభ్యులు అభినందించడం జరిగింది. అలానే పొన్నాకల్ యాదవ సంఘం అధ్యక్షులు చందు యదవ్, శివషాలి యాదవ్, శివకుమార్ యాదవ్, బుచ్చన్న యాదవ్ ఆధ్వర్యంలో కేకు కట్ చేయించి, తారక ను శాలువతో సన్మనించి, అలనే తల్లిదండ్రులను కూడా సన్మనించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, వేణు యాదవ్, శ్రీధర్ యాదవ్, కురుమూర్తి యదవ్,అశోక్ యాదవ్,శ్రీకాంత్,నర్సింహ,పొన్నకల్ యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


