సిద్దిపేట సాగు నీటి కల సాకారం అయింది మా హయాంలోనె
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట
చరిత్ర లో నిలిచే పనులు ఎన్నో చేసిన ఘనత మీకె దక్కుతుంది. పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవా ఎల్లప్పుడూ ఉంటుందని చిన్నకూడూర్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.హరీష్ రావు మాట్లాడుతూ చిన్నకోడూరు మండల పరిషత్ చివరి సర్వ సభ్యసమావేశం జరుపుకుంటున్నాం. మీరందరూ గత 5 సంవత్సరాలుగా కష్టపడి ప్రజలకు మీ సేవలను అందించారు. సర్పంచ్ లు ఎంపీటీసీ లు కలిసి చాల గ్రామాల్లో సమన్వయంతో పని చేశారు. కాళేశ్వరం నీళ్లను రైతులకు రెండు పంటలకు అందించిన గొప్ప అవకాశం మీ హయాంలో మీకు దొరికింది. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటాం. కానీ సాగునీరు మనకు జీవన ఆధారం. జీవన గతిని, పల్లెల ముఖ చిత్రాన్ని మార్చేది సాగు నీరు. అలాంటి సాగునీరు మీ ఈ అయిదేళ్ల కాలంలో రైతులకు అందడం మీ అదృష్టం.
గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలు బాగుచేసుకున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు, ఓపెన్ జిమ్ లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఇలా అనేక అభివృద్ధి పనులు మీ హయాం లో చేసుకున్నాం.
అభివృద్ధి అక్కడితో ఆగదు. ఎంత చేసుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇంకా పనులు మిగిలే ఉంటాయి. పదవుల్లో ఉన్నపుడు ఎన్ని మంచి పనులు చేశామనేదే శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి మీకు మళ్లీ ఇంకా మంచి అవకాశాలు రావలని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కోరుకుంటున్నాను. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, ఎవరైనా మాజీలు కావాల్సిందే. అధికారంలో ఉన్నా లేకపోయినా నా సహకారం ఎప్పడికి మీకు ఉంటుంది. ఇలాగే ఎప్పుడు మీరు ప్రజల్లో ఉంటూ, ప్రజా సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్నానని అన్నారు.
సిద్దిపేట సాగు నీటి కల సాకారం అయింది మా హయాంలోనె
- Advertisement -
- Advertisement -