సైలెంట్ గా సైడ్ అయిపోయిన సీదిరి
శ్రీకాకుళం, మార్చి 3, (వాయిస్ టుడే )
Sidiri was silently sidelined
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. సిద్ధాంత పరమైన విమర్శల కంటే.. వ్యక్తిగత విమర్శలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఫస్ట్ టైం గెలిచినప్పటికీ అప్పలరాజుకి సీఎం జగన్ ఐదేళ్లపాటు మంత్రిగా చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ గెలవడమే మొదలు అప్పలరాజు పలాసలో ప్రతీకార రాజకీయాలకు పాల్పడి, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అందుకే రీసెంట్ ఎన్నికల్లో 40,350 ఓట్ల మెజారిటీతో అప్పలరాజుపై.. గౌతు శిరీష అలవోకగా గెలుపొందారు.పలాస నగరం నడిబొడ్డున ఉన్న స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగించే ప్రయత్నం చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేశారనే నెపంతో.. అధికారుల సాయంతో విగ్రహాన్ని తొలగించేగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉంది. అయితే కేవలం గౌతు శిరీషాపై అక్కసు తోనే.. సీదిరి ఆ పని చేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అలానే కోడేలు చెరువు ప్రాంతాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించి.. ఇళ్లనిర్మాణాలు చేశారంటూ నిర్మాణాలని తొలగించడంతో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. నిర్మాణాల కూల్చివేతని నిరసిస్తూ.. లోకేష్ పలాస వస్తుండగా ఆయనను అరెస్ట్ చేయడం కూడా విమర్శలకు దారి తీసింది.ఇదంతా ఒక ఎత్తయితే… అప్పలరాజు పలాసలో ఆక్రమణలకు పాల్పడుతున్నారని అప్పట్లో గౌతు శిరీష ఆరోపణలు చేశారు. మంత్రి అయిన తరువాత భూముల ఆక్రమణలతో పాటు.. సూది కొండ, నెమలి కొండలను కూడా నిబంధనలకి విరుద్ధంగా తవ్వేశారని శిరీషా విమర్శలు గుప్పిస్తునే వచ్చారు. పలాస నియోజకవర్గంలో మంత్రిగా అప్పలరాజు చేసిన అభివృద్ధి ఏమిలేదని ఐదేళ్ల పాటు ఎద్దేవా చేసేవారు. దీంతో పలాసలో సీదిరి అప్పలరాజు.. గౌతు శిరీషాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేదని టాక్ నడిచేది. తనపై చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక అప్పలరాజు శిరీషాని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు… ఆమె కొత్త ఇంటి నిర్మాణం సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని టీడీపీ నేతలు ఫైర్ అవుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా గౌతు శిరీషా పై సోషల్ మీడియాలో సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయివైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీదిరి అప్పలరాజు తరచుగా మీడియా ముందుకు వచ్చే వారు. వైసీపీ పాలనపై పాజిటివ్‌గా స్పందించేవారు. అదే సమయంలో టీడీపీ, జనసేనలపై నిప్పులు చెరిగేవారు. అలాంటాయన ఇప్పుడు కొన్నాళ్లుగా ఆయన కనిపించడం లేదు. పలాస నియోజకవర్గంలోనూ ఆయన పేరు వినిపించడం లేదు. ఆయన కూడా కనిపించడం లేదు. ఎక్కడున్నారో కూడా చెప్పకుండా.. కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు.నిజానికి ఎన్నికలకు ముందు, తర్వాత కూడా సీదిరి రాజకీయాలు జోరుగా సాగాయి. వరుస విజయాలతో ఆయన దూసుకుపోవాలని అనుకున్నా.. గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం ఆయనకు దూరమైంది. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చినా.. తర్వాత సైలెంట్ అయ్యారు. దీనికి కారణం వేరే ఉందని అంటున్నారు పరిశీలకులు. అప్పలరాజు మంత్రిగా ఉన్న చేసిన సమయంలో పాల్పడిన అక్రమాలపై ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి పెట్టారంట. ఎక్కడ ఎంత మేరకు నిధులు దారిమళ్లాయన్న విషయంపై ఆమె కూపీ లాగుతున్నారంట. ఈ విషయాలు ఇంకా బయటకు పొక్కక ముందే.. మాజీ మంత్రి తనంతట తానే సైలెంట్ కావడం అనుమానాలకు తావిస్తోంది. ఎక్కడా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం కానీ.. నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ చేయడం లేదు. దీని వెనుక ఆయన భయపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.మరోవైపు.. వైసీపీలోనూ.. సీదిరిని వ్యతిరేకిస్తున్న వర్గం.. ఈ విచారణ ఎంత త్వరగా జరిగితే అంత బాగుంటుందని కోరుకుంటుండడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు.. తమను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో సీదిరిని పలాస వైసీపీ ఇన్చార్జ్‌గా తప్పించాలని వైసీపీ వర్గాలే డిమాండ్ చేస్తున్నాయి .. ఇలాంటి పరిస్థితుల్లోటీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషకూడా .. సమయం చూసుకుని సిదిరిపై చర్యలకు పావులు కదుపుతుండటంతో ఆ డాక్టర్ కం పొలిటీషియన్ సైలెంట్ అయిపోయారంట. సదరు మాజీ మంత్రివర్యలు వైసీపీ నాయకులకు కూడా అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారట. మరి మున్ముందు ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.