తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే
కేటీఆర్
హైదరాబాద్
తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ఆనాడు హైదరాబాద్లో గులాబీ కండువా కప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతున్నప్పుడు.. మొట్టమొదటిసారి ముందుకొచ్చి 2001లోనే కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేసి గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడని గుర్తు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ కష్టసుఖాల్లో పద్మారావు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని అన్నారు. యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు ఖరారైనట్లే అని స్పష్టం చేశారు
తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే
- Advertisement -
- Advertisement -