జీఎస్టీ స్లాబ్‌లను సులభతరం చేయడం చారిత్రాత్మక నిర్ణయం
బిజెపి పార్టీ రాష్ట్ర అద్యక్షులు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్ సెప్టెంబర్ 4
Simplifying GST slabs is a historic decision
న్యూఢిల్లీలో జరిగిన 56వ వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశంలో, దేశవ్యాప్తంగా సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్‌లను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని బిజెపి పార్టీ రాష్ట్ర అధ్క్ష్యక్షులు ఎన్.రాంచందర్ రావు కొనియాడారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ ట్యాక్స్ తగ్గిస్తూ, జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% పన్నుస్లాబ్ లను పూర్తిగా రద్దు చేసింది. 12% స్లాబ్ రద్దు చేయడంతో, ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% స్లాబ్ లలోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ శాతం జీరోకు తగ్గించబడింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో, జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కల్పిస్తోంది. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా.. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలిపారు.సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు నేరుగా లాభం చేకూర్చే జీఎస్టీ రేట్ల తగ్గింపు, సంస్కరణలు తీసుకురావడం జరిగింది.మోదీ ప్రభుత్వం వన్ నేషన్-వన్ టాక్స్, వన్ నేషన్-వన్ లా వంటి సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు.ఇప్పటివరకు అమలులో వున్న బ్రిటీష్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చిందని,బ్రిటీషర్ల కాలంలో భారతదేశంలో రకరకాల టాక్స్‌లు విధించి పేదప్రజలపై భారం మోపారు. మోదీ ప్రభుత్వం వన్ నేషన్-వన్ టాక్స్ సుకువచ్చిందన్నారు.జీఎస్టీ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ వంటి వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి, దేశవ్యాప్తంగా సులభమైన టాక్స్ వ్యవస్థ అమలు చేసింది.భారతదేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దేశ అభివృద్ధి కార్యక్రమాలకు వనరులు లభిస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ త్వరలో 5 ట్రిలియన్ ఎకానమీని చేరే దిశలో ఉందని,కేంద్రం 56వ జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ సులభతరం, రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. దసరా, దీపావళికి ముందే పండుగ సరుకులు ప్రజలకు తక్కువకే లభించనున్నాయి.పాలు, పనీర్, హేర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షాంపూలపై జీఎస్టీ తగ్గింపు జరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18% నుండి 5%, కొన్నింటిపై 12% నుండి 5%, మరికొన్ని జీరో శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం.మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆత్మనిర్భర & అభివృద్ధిపరచిన భారత్ గా తీర్చిదిద్దుతోంది.కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమేదీ సాధించలేక, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా, మోదీ గారి తల్లిగారిని దూషించేలా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖందించారు.ప్రధాని నరేంద్ర మోదీ గారికి జీఎస్టీ తగ్గించినందుకు, పండుగ సమయంలో ఊరట ఇచ్చినందుకు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలభిషేకం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది.మహిళా మోర్చా, కిసాన్ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో పాలాభిషేకం కార్యక్రమాలు చేయాలి.ద్ర హోం మంత్రి అమిత్ షా గారు తెలంగాణలోని భాగ్యనగరం గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరు రానున్నారు. మొజంజాహి మార్కెట్‌లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానానికి అనుగుణంగా శోభాయాత్రలో పాల్గొని, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు.భారతదేశం అమెరికా, రష్యా వంటి దేశాలపై ఆధారపడే దేశం కాదు. అమెరికా విధించే టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలు భయపడుతున్నా, భారత్ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా కాంకెప్ట్‌ను ముందుకు తీసుకుని జీఎస్టీ రేట్లు తగ్గించింది. దీని ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం కలిగింది. ప్రపంచంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన ఇతర దేశాల్లో ఆ ప్రభుత్వం అధికారంలో నిలబడలేకపోయినా, భారత్‌లో వన్ నేషన్-వన్ ట్యాక్స్ అమలు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం రెండుసార్లు విజయవంతంగా అధికారంలోకి వచ్చి, సింప్లిఫైడ్ ట్యాక్స్ ద్వారా దేశాన్ని బలోపేతం చేసిందని,సింప్లిఫైడ్ టాక్స్ సిస్టమ్ వల్ల దేశ అభివృద్ధికి దోహదమైందన్నారు.. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌తో జీఎస్టీ తగ్గించడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం జరుగుతోంది.తెలంగాణలో యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోంది. మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ ను అడ్డుకోలేకపోతోందని విమర్శించారు.


