హైదరాబాద్: సింగరేణి సంస్థ 327 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడు కేటగిరీల్లోని ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీఎండీ బలరాం తెలిపారు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. భర్తీ చేయనున్న పోస్టులివే..
ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో..
మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఈఅండ్‌ఎం) ఈ2 గ్రేడ్- 42, మేనేజ్‌మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 7.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో..
జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్‌ఎస్ గ్రేడ్ సీ- 100, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(మెకానికల్) టీఅండ్‌ఎస్ గ్రేడ్ సీ- 9, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ సీ- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1- 98.