కరీంనగర్, అక్టోబరు 7, (వాయిస్ టుడే ): దేశంలో సోలార్ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్ మరో భారీ పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వాహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చాలని నిర్ణయించారు.దేశంలో సోలార్ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టిన తొలి బొగ్గు కంపెనీగా పేరు తెచ్చుకున్న సింగరేణి కాలరీస్ మరో భారీ పర్యావరణహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సింగరేణి నిర్వాహణలో ఉన్న ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటును గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గా మార్చనున్నారు. స్వీయ నిర్వహణలో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఇప్పటికే సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ విద్యుత్ విభాగ ఉన్నతాధికారులను ఆదేశించారు.ప్రతి పరిశ్రమ పర్యావరణ స్పృహతో ఉత్పత్తులు సాధించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 224 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను పర్యావరణ హితంగా నిర్వహిస్తున్న సింగరేణి, పర్యావరణ హిత హైడ్రోజన్ ను కూడా ఉత్పత్తి చేయాలని ఛైర్మైన్ సూచించారు.1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర వినియోగానికి అవసరమైన హైడ్రోజన్ ను ఇకపై సోలార్ విద్యుత్తు ను వినియోగిస్తూ ఉత్పత్తి చేయాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రస్తుత ప్లాంటు లో తక్షణమే చేపట్టాలని ఆదేశించారు.అలాగే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరారు.
గ్రీన్ హైడ్రోజన్ వాడే తొలి పవర్ స్టేషన్ సింగరేణి
దేశం లో గ్రీన్ హైడ్రోజన్ వాడే తొలి పవర్ స్టేషన్ కానున్న సింగరేణి సాధారణంగా హైడ్రోజన్ వాయువు ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతి లో ఉత్పత్తి చేస్తుంటారు.ఈ ప్రక్రియలో థర్మల్ విద్యుత్తు కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ ను ‘గ్రీన్ హైడ్రోజన్’ గా పేర్కొంటున్నారు.సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల రెండు 600 మెగావాట్ల జనరేటర్ ల లో వేడిమిని తగ్గించడం కోసం శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ ను వినియోగిస్తున్నారు. దీనికోసం ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఏడాదికి దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ 100 కిలో వాట్ విద్యుత్తును వినియోగిస్తూ హైడ్రోజన్ వాయువు ను ఉత్పత్తి చేస్తుంది.ఈ నేపథ్యంలో పర్యావరణహిత చర్యగా ప్లాంటును ఇకపై సోలార్ విద్యుత్తు వినియోగం ద్వారా నిర్వహించాలని, తద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తూ, దానిని వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా దేశంలో నిలవాలని సింగరేణి సంస్థ భావించింది.సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం మరియు 5మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడి నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రస్తుత హైడ్రోజన్ ప్లాంటుకు వినియోగించు కునేందుకు పూర్తి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత చర్యగా మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను కూడా రామగుండం రీజియన్ లో సింగరేణి సోలార్ ప్లాంట్లు గల ప్రాంతంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించవలసిందిగా ఆదేశాలు జారీచేశారు.గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సింగరేణి ఏర్పాటు చేస్తే ఈ హైడ్రోజన్ వాయువును సింగరేణి తో పాటు సమీపంలోని ఎరువుల కర్మాగారాలకు ఇతర కర్మాగారాలు కూడా విక్రయించే అవకాశం ఉంది. లాభాల కన్నా ఒక మంచి పర్యావరణ హిత చర్యగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టాలని కంపెనీ భావిస్తుందని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. తద్వారా సింగరేణి సంస్థ తెలంగాణ ట్రాన్స్ కో కు చెల్లించే విద్యుత్ బిల్లులో 108 కోట్ల రూపాయలను ఆదా చేసుకోగలిగిందని సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం, డి.సత్యనారాయణ రావు తెలిపారు…ఇంకా నిర్మాణంలో ఉన్న 76 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు