వేణు ఉడుగుల చేతుల మీదుగా
‘సింగిల్ రాజు’ మూవీ గ్లింప్స్ రిలీజ్
‘Single Raju’ Movie Glimpse Released by Venu Udugula
టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో, యువ దర్శకుడు ఎస్.ఎస్. వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సింగిల్ రాజు’.
విభిన్నమైన టైటిల్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం ‘మా ఈవెంట్స్’ (maaa Events) సహకారం(Collaboration)తో
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు, నిర్మాత వేణు ఉడుగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లిమ్స్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ.. “ఎస్.ఎస్. వర్మ, విశ్వస్ ఇద్దరూ నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా కథ వినగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ఎంతో ధృడ సంకల్పంతో ఈ సినిమాను
ప్రారంభించారు. చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. చిత్ర యూనిట్ మొత్తం మంచి కష్టపడి పనిచేస్తోంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.
దర్శకుడు ఎస్.ఎస్. వర్మ మాట్లాడుతూ.. “వేణు ఉడుగుల అన్న సపోర్ట్ లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా కోసం నాకంటే ఎక్కువగా మా అమ్మానాన్నలు కష్టపడ్డారు. ప్రేక్షకులను
తప్పకుండా అలరించే మంచి ఎంటర్‌టైనర్‌గా ‘సింగిల్ రాజు’ నిలుస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
హీరో విశ్వస్ మాట్లాడుతూ.. “దర్శకుడు ఎస్.ఎస్. వర్మ మేము ఎంతో ఫ్యాషన్ తో చేస్తున్న సినిమా. విలేజ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ సపోర్ట్ చేశారు. మా సినిమా ను ప్రతి ఒక్కరు
ఆదరించాలని కోరుకుంటున్నాం.” అని అన్నారు.
హీరోయిన్లు మౌనిక, దివ్య మాట్లాడుతూ.. మా సినిమా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే కథలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్టర్ కు థాంక్స్. టీమ్ అందరూ సపోర్ట్
చేశారు. అని అన్నారు.
టైటిల్ లోగోలో కనిపిస్తున్న ‘బ్రోకెన్ హార్ట్’ ఎమోజీని బట్టి ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి
నెలకొంది. త్వరలోనే నటీనటులు, ఇతర విశేషాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.



