Saturday, February 21, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు
హైదరాబాద్, జనవరి 29

SIT notices to KCR in phone tapping case
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే BRS పార్టీ ముఖ్యనేతలను విచారించిన SIT, ఇప్పుడు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించనుంది. CRPC 160 ప్రకారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. కేసు దర్యాప్తు అధికారి, ఏసీపీ వెంకటగిరి ముందు జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్‌కు విచారణకు రావొచ్చని.. లేదా ఆయన వయసు రీత్యా ఆయనకు తగిన చోట విచారణకు హాజరు కావొచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో నోటీసులు అందజేశారు. కేసీఆర్ ఎక్కడ విచారణ కోరుకుంటున్నారో దర్యాప్తు అధికారికి తెలపాలని నోటీసుల్లో సూచించారు.వయసురీత్యా పీఎస్ రావాల్సిన అవసరం లేదన్న సిట్ అధికారులు విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు.  హైదరాబాద్ పరిధిలో KCR కోరిన చోటే విచారణ జరుగుతుందని…అయితే ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు సిట్ అధికారులు.  జనవరి 30 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు.  ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు BRS అగ్రనాయకులను విచారించారు సిట్ అధికారులు. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ ఎంపీ సంతోష్ రావును ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీసు అధికారుల నుంచి సేకరించిన వివరాలు ఆధారంగా KCRను ప్రశ్నించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత BRS ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ ఫోన్ నిఘా ఆరోపణలతో మొదలైంది.. 2024 మార్చిలో ఈ విషయం వెలుగుచూసిందిఅప్పటి ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు ముఖ్యంగా మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రతిపక్షనేతలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, సెలబ్రెటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయ్2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. SIB లోని అదనపు ఎస్పీ ప్రణీత్ రావు ఫిర్యాదు మేరకు DSP ప్రణీత్ రావు వంటి అధికారులపై అక్రమ నిఘా ఆరోపణలతో కేసు ప్రారంభమైంది.600 మందికిపైగా ఫోన్లు ట్యాప్ చేశారని వేలమంది కాల్ డేటా రికార్డులు , ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులు అక్రమంగా యాక్సెస్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలను నియంత్రించేందుకు , ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు జరిగిందనే ఆరోపణలున్నాయఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకూ సిట్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరింత బలపడింది. పలువురు SIB అధికారులు అరెస్ట్ అయ్యారుBRS అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు విచారణకు హాజరయ్యారు..
తెలంగాణ  ఆత్మగౌరవాన్ని టచ్ చేశారన్న హరీష్
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో  కలకలం రేపుతోంది..BRS వర్గాలు దీన్ని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిఘా జరిగిందని, దాన్ని బయటపెట్టాలని చెబుతోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు, సిట్ విచారణలో వెలుగుచీసిన వాస్తవాల ఆధారంగానే తాము ముందుకు వెళ్తున్నామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. జనవరి 30న జరగనున్న విచారణలో కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? ఏ సమాధానాలు చెబుతారు? ఇదే ఇప్పుడు ఉత్కంఠగా మారిందితెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను తెలిపితే… అక్కడకే వచ్చి విచారణ జరుపుతామని పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ కుమార్ లను సిట్ విచారించింది. మళ్లీ అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి తెలియజేసింది. ఇప్పుడు గులాబీ బాస్ ను విచారణకు పిలవడంతో ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరెన్ని మలుపులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యేనని, ఈ కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత అని, కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవమని, అలాంటి నాయకుడిపై బురద చల్లాలని చూడటం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని వ్యాఖ్యానించారు.పాలనలో తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ముఖ్యంగా సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ పేరుతో నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ వేధింపులతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం రేవంత్ రెడ్డి రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కేసీఆర్ అని హరీశ్ రావు కొనియాడారు. కేసీఆర్ చరిత్రను సృష్టిస్తే, ఆ చరిత్రను మలినం చేసేందుకు రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారం అంతకంటే కాదని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉందని, ప్రభుత్వ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.
కేసీఆర్ అంటే గౌరవం
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నంది నగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకొని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా సిట్ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ పై తమకు ఎంతో గౌరవం ఉందని… అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిగ్గుతేలాల్సి ఉందని చెప్పారు.అప్పటి సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్ కు ఉందని… కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పారు. బాధ్యులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్