Friday, December 13, 2024

ఆరు సీట్లు లంబాడాలకు, ఆరు సీట్లు ఆదివాసీలకు: రేవంత్ రెడ్డి

- Advertisement -

బోథ్: ఆదివాసీలు , లాంబాడాలు కాంగ్రెస్ కు రెండు కళ్లలాంటివారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు భోథ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అయన పాల్గోన్నారు. తెలంగాణలో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 లాంబాడాలకు, 6 ఆదివాసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. బలరాం నాయక్ పెద్దమనసుతో ఆదివాసీ బిడ్డకోసం ఇల్లందు సీటు వదులుకుండు. పదవి కంటే ప్రజలకు మేలు జరగడం ముఖ్యమని ఆయన తన ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసారు. ఓటు చీలిపోకుండా కూడాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు ? ఇక్కడి ప్రజలకు పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వలేదు ? తండాలను పంచాయితీలు చేశామని చెప్పుకునే కేసీఆర్ ఎన్ని పంచాయతీలకు భవనాలు కట్టించారు ? గ్రామసర్పంచులకు వేల కోట్ల బకాయిలు ఇవ్వక ప్రభుత్వం వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పింది. కేసీఆర్ తన మేధస్సును రంగరించి కాళేశ్వరం కట్టిన అని చెప్తుండు. కట్టిన మెడిగడ్డ మూడేళ్లలో కుంగిపోయింది… అన్నారం పగిలిపోయింది.

Six seats for Lambadas, six seats for Adivasis: Revanth Reddy
Six seats for Lambadas, six seats for Adivasis: Revanth Reddy

బోథ్ కు నీళ్లు రాకపోవడానికి ఈ దద్దమ్మ సీఎం కేసీఆరే కారణం. ఇక్కడి కుఫ్టీ ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. బోథ్ కు డిగ్రీ కాలేజీ రావాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలి. ఒక్కసారి ఈ బోథ్ గడ్డపై కాంగ్రెస్ ను గెలిపించండి. డిసెంబర్ 31లోపు బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేసే జిమ్మేదారి నాదని అన్నారు.
కుఫ్టీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభోత్సవానికి వచ్చే బాధ్యత నాది. ఆదిలాబాద్ నుంచి అచ్ఛంపేట అడవుల వరకు కాంగ్రెస్ ను గెలిపించండి. ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం. దొరలపాలన పోవాలి.. ఇందిరమ్మ రాజ్యం రావాలి. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. మాట తప్పని మడమ తిప్పని నాయకురాలు.  సోనియమ్మ. సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో  కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్