- Advertisement -
డంపింగ్ యార్డ్ ఒద్దు అని అరవరోజు నిరసన
Sixty-day protest against dumping yard closure
సంగారెడ్డి
ప్యారానగర్ డంపింగ్ యార్డ్ కి వ్యతిరేక పోరాటం పేరుతో గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)ఆధ్వర్యంలో స్వచ్చందంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అత్యధిక సంఖ్యలో మహిళలు, గ్రామ యువకులు రైతులు పాల్గోన్నారు. మాకొద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదలాతో మండల కేంద్రంలో వీధి వీదికి ర్యాలీ జరిగింది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులకు అటవీ లోని వన్యాప్రానులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు చేసారు. వెంటనే డంపింగ్ యార్డ్ను నిలిపివేయాలని డిమాండ్, డంపింగ్ యార్డ్ నుండి మా ప్రాంత ప్రజలను కాపాడండి. భవిష్యత్తు తరాలను కాపాడండి, డంపింగ్ యార్డ్ వల్ల మా పిల్లలా భవిష్యత్తును కోల్పోతాం. లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో ఏక వాక్య తీర్మానం పేరుతో డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా పోస్టల్ బాక్స్ ఏర్పాటు చేసారు. డంపింగ్ యార్డ్ నిర్ములించే వరకు ఉద్యమం ఆపమని తేల్చి చెప్పారు.
- Advertisement -