ఖమ్మం: ఈ మార్కెట్ తీసుకొచ్చింది నేను ఒకసారి ఇక్కడున్న శిలా ఫలకం చూడండి ఎవరు ప్రారంభించారో దాని మీద ఉంది. మార్కెట్ తెచ్చిన నేనే మార్కెట్ ను ఎందుకు తరలిస్త దీనిని తరలిస్తే వెంటనే కబ్జా చేయాలని చూస్తున్నారు. నేను ఎన్ఎస్పీ కాలువలు ఆక్రమించి కాలేజీ కట్టలేదు.. ప్రభుత్వ భూమి ఆక్రమించలేదు పాత బస్టాండ్ ని ఆక్రమించాలని చూడలేదు అంటూ మంత్రి పువ్వాడపై మాజీ మంత్రి తుమ్మల నాగెశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఖమ్మం నగరం లోని ప్రధాన పత్తి , మిర్చి మార్కెట్ లను అయన సందర్శించారు. మార్కెట్ లోని రైతులు వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడారు. నేను అధికారంలో ఉన్నప్పుడు రైతును మార్కెట్ కమిటీ చైర్మన్ గా చేసిన ఆ తరువాత రాధాకృష్ణ ఛైర్మెన్ గా చేసిండు.
ఇప్పుడు ఛైర్మెన్ గా ఎవరు ఉన్నారో మీకు తెలుసు
ప్రకాష్ నగర్ బ్రిడ్జి తీసుకొచ్చింది నేను.. బైపాస్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జి తీసుకొచ్చింది నేను.. కానీ ఆ బ్రిడ్జిలు గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు. ఒకసారి ఆ బ్రిడ్జి మీద ఉన్న శిలాఫలకాను చూడమనండి వాటిని ఎవరు తీసుకొచ్చారు ఎవరు శంకుస్థాపన చేశారు వాటి మీద పేర్లు ఉంటాయి. కొత్త బస్టాండ్ తీసుకొచ్చింది నేను దాని శంకుస్థాపన అప్పుడు చెప్పాను దీనిని మూడంతస్తులుగా కట్టి ఒక మల్టీప్లెక్స్ గా చేద్దామని కానీ దాని కాంట్రాక్టర్ ని మార్చి రేకులతో కట్టారు. నేను తెచ్చేవాడినే కానీ తీసుకపోయే వాడిని కాదు ఈ మార్కెట్ ని ఇంకా అభివృద్ధి చేస్తా దీనిని రాష్ట్రంలో ఒక అద్భుతమైన మార్కెట్ గా తీర్చిదిద్దా అంటూ రైతులకు వ్యాపారులకు హామీ ఇచ్చారు.


