సామాజిక న్యాయం కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్..
ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
Social Justice Caref Address Congress..
MLC TPCC President Mahesh Kumar Goud
కులఘనన చేసినా.. ఎస్సీ వర్గీకరణ చేసినా. పార్టీ, ప్రభుత్వ, చట్ట సభల్లో బీసీ, ఎస్సి, ఎస్టీ లకు పదవులు ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భాకవం లో మేడియా తో మాట్లాడుతూ మొదట వచ్చిన ఎమ్మెల్సీలలో బిసి లకు రెండు ఒక మైనార్టీకి ఇచ్చామని తర్వాత 2 రాజ్యసభ సీట్లు వస్తే ఒక సీటు యువ బిసి నేత అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు అవకాశాలు వస్తే ఒక సీటు పొత్తు ధర్మంలో సీపీఐ కి ఇచ్చాము. వారు కూడా అక్కడ బిసి అభ్యర్థి కి ఇవ్వడం హర్షించదగ్గ విషయంమన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 వస్తే ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బిసి మహిళకు ఇచ్చాము..ముఖ్యమంత్రి రెడ్డి కి అవకాశం వస్తే పీసీసీ గా నాకు ఒక బిసి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు. ఏ అవకాశం వచ్చినా బిసి లకు ఎస్సి, ఎస్టీ లకు ప్రముఖ స్థానం ఇస్తూ కాంగ్రెస్ మంచి అవకాశాలు కల్పిస్తుందన్నారు. .అందుకే దేశంలో ఎక్కడా లేని విదంగా కుల ఘనన చేసి 56 శాతం బీసీ లు ఉన్నారని తేల్చి చెప్పాము. అసెంబ్లీ లో బిల్లు పెట్టి తీర్మానం చేసి దేశ వ్యాప్తంగా బిసి కులఘనన అయ్యేలా పోరాటం చేస్తాం..సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం రోల్ మాడల్ గా ఉంటుంది..కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఉంటుందన్నారు.