ఉమ్మాయి పల్లె తండాలో నీటి సమస్యకు పరిష్కారం..
కొలిమిగుండ్ల,
కొలిమిగుండ్ల మండలంలోని ఉ మ్మాయిపల్లి తండాలో చాలా రోజుల నుండి ప్రజలకు నీటి సమస్య ఉండడంతో ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ ఎస్. లక్ష్మీదేవి, పీరునాయక్, బి కే నాయక్, శ్రీను నాయక్, లక్ష్మి రామ్ నాయక్, లింబు వెంకటేష్ నాయక్,ఇంకా తదితర గ్రామ పెద్దలు కలిసి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెంటనే స్పందించి గ్రామంలో నీటి సమస్య కోసం వెంటనే బోరు వేయించే విధంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ సర్పంచ్ ఎస్. లక్ష్మీదేవి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉమ్మాయిపల్లి తండాలో బోరు వేయగా గంగమ్మ తల్లి వల్ల నీరు పుష్కలంగా పడటంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల నుండి తండాలో నీటి సమస్య ఉండటంతో బోరు వేయడం వలన నీటి సమస్యకు పరిష్కారం కావడంతో ఉ మ్మాయి పల్లె గ్రామ సర్పంచ్ ఎస్. లక్ష్మీదేవి, పీరు నాయక్, బికేనాయక్, శ్రీను నాయక్, లింబు వెంకటేష్ నాయక్, లక్ష్మీ రామ్ నాయక్, ఇంకా గ్రామ పెద్దలు ప్రజలు కలిసి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.