అనేక సమస్యలను పరిష్కరించా… నాకే ఓటేయండి…:  తలసాని

- Advertisement -

హైదరాబాద్: సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్ది, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నాడు బేగంపేట, అమీర్ పేట డివిజన్ లలో ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి చేశా. అనేక సమస్యలను పరిష్కరించా. నాకే ఓటేయండని కోరారు.

సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని తొమ్మిదిన్నర సంవత్సరాలలో  చేసినామని అయన అన్నారు. నా కంటే ముందు గెలిచిన వారు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి గా ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్  సహకారంతో 1400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసినం. మరోసారి అత్యధిక మెజార్టీ తో గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.మంత్రి తలసాని కి పలు  అపార్ట్మెంట్ లు, కాలనీలు, బస్తీ ప్రజలు మద్దతు ప్రకటించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular