లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం: డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి

- Advertisement -

మంగళగిరి: ఆదివారం జరిగిన  లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుతు పరిష్కారం అయ్యయాని  డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా  న్యాయస్థానం ఏర్పాటు చేసిన 386 ప్రత్యేక బెంచ్ ల ద్వారా

 

జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంభందించి మొత్తం 1,22,146 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో భూమి, ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు,

 

దోపిడీలు, సాదారణ స్థాయిలో హింస వంటి కేసులు కాగా ఐపిసి కాని ఇతర కేసులు మరియు పెట్టి కేసులు 1,02,996 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

 

అన్నారు. లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారంలో  ప్రత్యేక శ్రద్ద చూపిన ఎన్టిఆర్ జిల్లా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడప,చిత్తూరు జిల్లా ఎస్పీలను, సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular