- Advertisement -
దసరా, దీపావళి దృష్ట్యా 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway has extended 60 special trains on the occasion of Dussehra and Diwali
Aug 30, 2024,
దసరా, దీపావళి దృష్ట్యా 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా.. వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి. వరుసగా పండగలు ఉండటంతో రద్దీ భారీగా పెరుగుతుందని రైల్వేశాఖ అంచనాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -