నిర్మల్ పోలీస్ శాఖ అనాథులైన కుటుంబానికి అండగా నిలుస్తూ 30 లక్షల చెక్కును అందించి మేమున్నాం అని భరోసా కల్పించిన ఎస్ పి సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో, నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలో ఎస్పి పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో లోకేశ్వరం మండలం పోలీసు స్టేషన్ లో హోంగార్డ్ గా విధులు నిర్వహించే తుంగెన నర్సింగ్ రావు హెచ్ జి నంబర్ 343 అనే హోమ్ గార్డ్ నిజామాబాద్ జిల్లాలో 06.04.2023 రోజున నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు విధి నిర్వహణకు వెళ్లి రాత్రి తిరిగి వస్తుండగా మొహాల x రోడ్ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించగా యాక్సిస్ బ్యాంక్ యొక్క 30 లక్షల రూపాయల చెక్కును హోంగార్డ్ కుటుంబానికి ప్రమాద బీమా కింద జిల్లా ఎస్పీ శ్రీ. సిహెచ్. ప్రవీణ్ కుమార్, ఐపిఎస్.., అందజేసినారు. పోలీస్ సిబ్బంది వారి శాలరీ ఎకౌంటు AXIS BANK కు అనుసంధానం ఉండడం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారులకు 30 లక్షలు చెక్కు అందజేసినా యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యానికి వారికీ జిల్లా పోలీస్ శాఖా ఎస్పీ గారు కృతజ్ఞతలు తెలిపినారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బాసర IIITలో ఔట్సోర్సింగ్ వేతనంతో ఉద్యోగం ఎస్పీ చోరువుతో ఇవ్వడం జరిగింది. బాదిత హోంగార్డ్ బ్యాంకు లబ్ది పొందేలా కృషి చేసినా ఏఎస్పీ భైంసా, ముధోల్ సీఐ, లోకేశ్వరం ఎస్సై, ఎస్బి ఇన్స్పెక్టర్, ఆర్ఐ మరియు సిబ్బందికి అభినందించి రివార్డులు అందజేసినారు.
ఈ సందర్భంగా AXIS బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బందిని అభినందించినారు.
తొంగేనా నర్సింగరావు లేని లోటు– తన బిడ్డలను దుఃఖంలో ఉన్న సందర్భంగా నాన్న మరణాన్ని జీర్ణించుకోలేకపోయాం…(ప్రియాంక, ప్రణవి) అని అన్నారు
అమ్మలేని లోటు తెలియకుండా అన్నితానై తమ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన నాన్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మేము ఇద్దరం అమ్మాయిలం తమ చిన్నతనంలోనే అమ్మ చనిపోగా ఏ కష్టం రానివ్వకుండా పెంచి పెద్ద చేసి మంచి చదువు చెప్పించి పెళ్లిళ్లు సైతం చేసేందుకు నాన్న పడిన కష్టం మమ్మల్ని కలిచి వేసింది. మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి ఆయన పడిన శ్రమ వెలకట్టలేనిది. అలాగే పోలీసు శాఖ తరపున అన్ని విధాల ఆదుకుంటున్న జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ అలాగే పోలీస్ శాఖ కు కూడా ప్రత్యేక మా కోసం చేసిన సేవలను జీవితాంతం కృషి చేసినందుకు మా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్., అదనపు ఎస్పీ (ఏఆర్) వెంకటేశ్వర్లు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు రమేష్, రామకృష్ణ, ఎస్ఐ లోకేశ్వరం సాయికుమార్, యంటీఓ వినోద్, AXIS బ్యాంక్ సిబ్బంది, హోంగార్డ్ కుటుంబ సభ్యులు, దేవ్ రావ్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.