గుంటూరు.. భాష్యం విద్యార్థులతో ముప్పవరపు వెంకయ్య నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి
భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కామెంట్స్..
భాష్యం విద్యార్థులను సన్మానంచే కార్యక్రమానికి నన్ను భాగస్వామిని చేసినందుకు సంతోషంగా ఉంది..
భాష్యం విద్యాసంస్థల్లో చదువుతున్న ఇన్ని వేలమంది విద్యార్థులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది..
నా విద్యార్ధి దశను నాకు గుర్తు చేసారు..
పదవి విరమణ చేసినా దేశం మొత్తం తిరుగుతున్నాను..
దేశం భవిష్యత్తుకు విద్యార్ధులే పునాది..
పిల్లలందరూ మాతృభాష లో మాట్లాడండి..
మాతృభాష ను, జన్మనిచ్చిన తల్లి తండ్రులను, భవిష్యత్తు ఇచ్చిన గురువులను మర్చిపోకూడదు..
జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే లక్ష్యాన్ని ఎంచుకోండి..
పట్టుదల,క్రమశిక్షణ,అంకిత భావం తోనే నేను దేశంలోనే అత్యున్నత స్థానానికి చేరుకున్నాను..
అంచెలంచెలుగా ఎదిగి దేశంలోనే ఉన్నత స్థానానికి భాష్యం విద్యాసంస్థలు చేరాయి.
సామాజిక స్పృహతో జీవించాలి.
ప్రతి ఒక్కరూ సాటి వారికి సహాయం చేయాలి,దాని వల్ల సమాజం బాగుపడుతుంది..
దేశ భక్తిని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి..
రాష్ట్ర పతి ద్రౌపది మురుము మాతృభాష చదువుకుని ఎదిగారు..
ప్రకృతిని ప్రేమించండి,ప్రకృతిని రక్షించండి..
టెక్నాలజీలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం..
స్వదేశీ విజ్ఞానం తో పంపిన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది, రష్యా పంపిన రాకెట్ ఫెయిల్ అయింది..
భాష్యం విద్యాసంస్థల్లో చదివి నీట్ లో 5,10 ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను అభినందిస్తున్నా..
అంతేకాకుండా IIT,JEE అడ్వాన్స్ లోకూడా ఆల్ ఇండియా ర్యాంకులు తెచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్ధిని అభినందిస్తున్నాను..
ఇంత మంచి విద్యను అందించి విద్యార్ధులను తీర్చిదిద్దుతున్న భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ను అభినందిస్తున్నాను..