మహిళ ప్రాంగణం విద్యార్థినులకు ప్రత్యేక అభినందనలు….జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Special congratulations to the female campus students....District Collector Muzammil Khan
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు విద్యార్థినులు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ ను కలిసిన మహిళా ప్రాంగణం విద్యార్థినులు
ఖమ్మం
ఎం.పి.హెచ్.డబ్ల్యూ. ఫలితాలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహిళా ప్రాంగణ విద్యార్థినులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఎం.పి.హెచ్.డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్) పరీక్షా ఫలితాల విడుదల నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులను సాధించిన ఖమ్మం మహిళా ప్రాంగణ విద్యార్థినులు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసారు.
రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎం.పి.హెచ్.డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్) పరీక్షలలో ఫస్ట్ ఇయర్ మొదటి పది ర్యాంకులలో 1,6,8,10 స్టేట్ ర్యాంకులు, రెండవ సంవత్సరం సంబంధించి రాష్ట్ర స్థాయిలో స్టేట్ 2 నుంచి 12 ర్యాంకులను, అలాగే జిల్లా స్థాయిలో మొదటి పది ర్యాంకులను మొదటి, రెండవ సంవత్సరం ఖమ్మం మహిళా ప్రాంగణం విద్యార్థినులకు వచ్చాయని మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.పి.హెచ్.డబ్ల్యూ (మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్) పరీక్షలలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విద్యార్థినులు జీవితంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగడం లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.
మనం చదివిన కోర్సుల ద్వారా ఏ పోటీ పరీక్షలకు హాజరు కావచ్చు, ఏ రంగాలలో ఎదగవచ్చు విద్యార్థినులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ఇతర ఉద్యోగ అవకాశాలను సైతం విద్యార్థినులు పరిశీలించి వాటిని చేపట్టేందుకు ముందుకు రావాలని అన్నారు. మన చదువుకు ఎటువంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి తెలుసుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
లభించిన ఉద్యోగాన్ని చేస్తూనే సాయంత్రం కొంత సమయం అదనపు కోర్సులు చదివి జీవితంలో మరింత ఎదిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు సాయంత్రం కొంత సమయం క్రీడలకు కేటాయించాలని, ఆ దిశగా విద్యార్థినులకు అవసరమైన సదుపాయాలను సిబ్బంది కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎం.పి.హెచ్.డబ్ల్యూ మొదటి సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో మొదటి, 6వ, 8వ, 10వ ర్యాంకు విద్యార్థినిలు జె.పావని, ఎం.శ్రావణి, డి.సంధ్యావిక, బి.కల్పన లను, అలాగే రెండవ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు నుండి 10వ ర్యాంకు పొందిన విద్యార్థినులు మనీలా, ప్రమీల రాణి, బి.రచన, పి.శాంతి ప్రియ, బి.శిరీష, బి.ఇందు, జె. ఎస్తేరు, డి.సాయి కుమారి, ఆర్. శైలజ లను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, నాగసరస్వతి, స్పందన, హిమబిందు, మల్లిక, విజయ్ కుమార్, సుకన్య, మౌనిక, లాలయ్య, దుర్గా రావు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.