Tuesday, April 1, 2025

 ప్రవీణ్ కేసుపై స్పెషల్ ఎంక్వైరీ.. సీఎం ఎంట్రీ

- Advertisement -

 ప్రవీణ్ కేసుపై స్పెషల్ ఎంక్వైరీ.. సీఎం ఎంట్రీ
విజయవాడ, మార్చి 28, (వాయిస్ టుడే)

Special inquiry into Praveen's case.. CM's entry

4 రోజులు అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. క్రైస్తవ సంఘాలు భగ్గు మంటున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అభిమానులు, అనుచరులు కోపంతో రగిలిపోతున్నారు. రాజకీయ, సామాజిక ప్రముఖులు ఘటనపై స్పందించారు. సోషల్ మీడియాలో మతవిధ్వేషాలు రగులుతున్నాయి. ఇంత జరుగుతుంటే.. ఇప్పటి వరకూ ఒక్క చిన్న క్లూ కూడా సంపాదించలేక పోయారు పోలీసులు. కనీసం పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా రాలేదు. నాలుగు రోజులవుతున్నా కేసు ఏమాత్రం ముందుకు సాగలేదు. ఫస్ట్ రోజు చెప్పిన మాటలే.. మళ్లీ మళ్లీ చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతి అంటూ కేసైతే నమోదు చేశారు. దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోంది. సాక్ష్యాలు దొరకకనా? ఖాకీల చేతకానితనమా? కావాలనే ఆలస్యం చేస్తున్నారా? అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కేసు తీవ్రతను గుర్తించి.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రత్యేక దృష్టి పెట్టారు. డెత్ మిస్టరీ ఇంకా వీడకపోవడంతో.. ప్రవీణ్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని డీజీపీని ఆదేశించారు. స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. హోంమంత్రి అనిత సైతం ఎప్పటికప్పుడు విచారణ పురోగతిని అడిగి తెలుసుకుంటుండటంతో పోలీస్ స్పెషల్ టీమ్స్ మరింత సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నాయిఅనుమానమంతా ఆ రెడ్ కారు మీదే. సీసీకెమెరా ఫూటేజ్‌లో ప్రవీణ్ రైడ్ చేస్తున్న బుల్లెట్ బండికి అత్యంత సమీపం నుంచి వేగంగా వెళ్లింది ఓ రెడ్ కారు. ఆ కారు ఎవరిది? ఆ కారే ప్రవీణ్ బైక్‌ను గుద్దేసిందా? అది యాక్సిడెంటా? కావాలనే యాక్సిడెంట్ చేసి చంపేశారా? బైక్ హెడ్ లైట్ డ్యామేజ్ అవడానికి ఆ కారే కారణమా? ఇలా రకరకాల యాంగిల్స్‌లో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. కొవ్వూరు టోల్‌గేట్ ఫూటేజ్‌తో పాటు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న వేరు వేరు సీసీకెమెరాలను చెక్ చేస్తున్నారు. రెడ్ కారు ఎక్కడినుంచి బయలు దేరింది? ఎక్కడికి చేరింది? ఆ కారులో ఎవరున్నారు? ఇలా ఆరా తీస్తున్నారు. నాలుగు రోజులవుతున్నా ఆ అనుమానాస్పద రెడ్ కారును గుర్తించలేకపోవడం మాత్రం డిపార్ట్‌మెంట్ ఫెయిల్యూరే అంటున్నారు.ప్రవీణ్ మృతిపై పోలీసులకు మహాసేన రాజేష్ ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టోల్‌గేట్‌కి ముందే దాడి జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు. కొవ్వూరు-అనంతపల్లి టోల్‌గేట్‌ల మధ్య ఉన్న అన్ని సీసీ కెమెరాల వీడియోలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బైక్‌పై నుంచి పడిపోయాక ఆయనపై దాడి చేసిఉండొచ్చని మహాసేన రాజేష్ చెబుతున్నారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేసి ఉంటారనే డౌట్స్ కూడా ఉన్నాయంటున్నారు.ప్రవీణ్ చనిపోయిన సంఘటనా స్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ క్లూస్ టీం విశ్లేషిస్తోంది. ఆ సమయంలో.. ఆ ప్లేస్‌లో ఉన్న మొబైల్ సిగ్నల్స్ సేకరిస్తున్నారు. ప్రవీణ్ పగడాలకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన అనుచరులు చెబుతుండటంతో.. ఆ ఫోన్ నెంబర్స్ ఆధారంగా వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారుప్రవీణ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే మరణంపై కాస్త క్లారిటీ రావొచ్చు. అయితే, ప్రాథమిక రిపోర్టు కూడా ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని.. తప్పుడు నివేదిక ఇస్తే రీపోస్టుమార్టం కోసం పోరాడుతామంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరిస్తున్నారు.ఇలా.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మతపరంగా, రాజకీయంగా అత్యంత సెన్సిటివ్ కేసుగా మారడంతో పోలీసులు విచారణను సవాల్‌గా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు సైతం జోక్యం చేసుకున్నారంటే తీవ్రత ఏమేరకు ఉందో తెలుస్తోంది. డెత్ మిస్టరీ వీడే వరకు.. ప్రవీణ్ భార్య జెస్సికా చెప్పినట్టు అంతా సంయమనంతో ఉండాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్