Sunday, September 8, 2024

దళిత, గిరిజనుల విద్య కై ప్రత్యేక పథకాలు: ఖర్గే

- Advertisement -
Special Schemes for Dalit and Tribal Education: Kharge
Special Schemes for Dalit and Tribal Education: Kharge

చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన  పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

హాజరైన ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే

దళిత, గిరిజన వర్గాల కోసం అనేక సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% కి పెంపు

ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని ప్రకటించిన ఖర్గే

అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేత

దళిత, గిరిజనుల విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకై ప్రత్యేక పథకాలు

సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయితీకి రూ. 25 లక్షల నిధులు

ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12%  రిజర్వేషన్లు

ప్రైవేటు విద్యా సంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన

ఇళ్లు లేని ఎస్సీ,ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంలో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేత

బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ.. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం

3 ఎస్సీ కార్పొరేషన్లు.. మాదిగ, మాల మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు  ఏర్పాటు.. ప్రతి ఏడాది రూ.750 కోట్ల నిధులు

Special Schemes for Dalit and Tribal Education: Kharge
Special Schemes for Dalit and Tribal Education: Kharge

3 ఎస్టీ కార్పొరేషన్లు, .. తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, మరియు ఎరుకల కార్పొరేషన్లు  ఏర్పాటు.. ప్రతి ఏడాది రూ.500 కోట్ల నిధులు

నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబా బాద్ లో 5 కొత్త ఐటీడీఏలు – ఐటీడీఏలలో 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

విద్యా జ్యోతులు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్ పాసైతే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష అందజేత, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు అందజేత

విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్