శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ న్యూమూవీ గ్లింప్స్‌

- Advertisement -

శ్రీ విష్ణు – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ న్యూమూవీ గ్లింప్స్‌

Sree Vishnu – Sithara Entertainments New Movie Glimpse
యువ కథానాయకుడు శ్రీ విష్ణు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నం.39. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది.
ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో రూపొందుతున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, కథ ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సహజమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పిస్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
యువతకు కనెక్ట్ అయ్యే కథాంశం, సహజమైన భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన కథనంతో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నం.39 ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా “ఇది మన అందరి కథ” అనే భావనను అందించనుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular