21.2 C
New York
Friday, May 31, 2024

ఘనంగా జరిగిన శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవం

- Advertisement -

ఘనంగా జరిగిన శ్రీ చెన్న సోమేశ్వర స్వామి రథోత్సవం

కర్నూల్ జిల్లా సి.బెలగల్ మండలంలోని క్రిష్ణ దొడ్డి గ్రామంలో వెలసిన  శ్రీ కోన వేంకటేశ్వర స్వామి రథోత్సవం మేళతాళాలతో డప్పుధరువులతో ,రంగు రంగుల బాణా సంచా పేలుస్తూ అశేష భక్త జనాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నమో వేంకటేశ్వర నమః అంటూ జయ జయనాదాల మధ్య రథోత్సవం ముందుకు సాగింది.ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో రథోత్సవం రోజూ చుట్టూ గ్రామాల ప్రజలు ఘనంగా పండగ జరుపుకుంటారు. ఈ రథోత్సవం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా తెలంగాణ , కర్ణాటక నుండి భారీగా భక్తులు వచ్చారు.ఈ రథోత్సవంలో  ఏలాంటి సంఘటనలు జరగకుండా సి.బెలగల్,గూడూరు సబ్ ఇన్స్పెక్టర్ తిమ్మరెడ్డి,హానుమంతయ్య పోలిస్ సిబ్బంది పాల్గొని బందోబస్తు నిర్వహించారు.గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎద్దుల పందాలు మరియు పొట్టేలు పందాలు జరుగుతున్నాయి. గుడి  మేనేజ్మెంట్ మల్లికార్జున, రాముడు , తలారి వెంకటేష్, తలారి వెంకట రాముడు, శీను,రామాంజినేయులు,రామకృష్ణ, దస్తగిరి, వడ్డే వెంకటేష్, గొల్ల క్రిష్టన్న,గొల్ల సురేష్ మరియు తదితరుల గ్రామ పెద్దల ఆద్వర్యంలో రథోత్సవం జరిగింది

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!