శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ

- Advertisement -
Sri Jain Shretambar Terapant Sabha
Sri Jain Shretambar Terapant Sabha

సికింద్రాబాద్..:  జైన్ సమాజం లో ప్రతి ఏటా జైనులు తమ ఆత్మశుద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైనులంతా సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో ప్రత్యేకంగా  శ్రీ జైన్ శ్రేతాంబర్ తెరపంత్ సభ నిర్వహించారు.. ఉపవాస దీక్షలలో చివరి రోజు కావడంతో జైనులు పెద్ద ఎత్తున తెరపంత్ సభ కు హాజరై సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించనున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జైన మత గురువైన సాద్వి శ్రీ మంగల్ ప్రగ్యా  పాల్గొని ఉపన్యాస ప్రవచనాలు ఇచ్చారు.. జప దివస్ లో భాగంగా వారం రోజులపాటు కఠిన ఉపవాస దీక్షలను చేయనున్నట్లు జైన్ సమాజ్ అధ్యక్షుడు బాబు లాల్ తెలిపారు.. జైన్ సమాజం మానవ విలువలను శాంతి కోసం పరితపిస్తుందని అన్నారు.. తాము చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో భగవంతునితో క్షమాపణ కోరుకుంటామని అన్నారు. ధ్యాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడడంలో ధ్యానం ఏకాగ్రత కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె తెలిపారు.. సమస్యలకు పరిష్కార మార్గం కోసం ధ్యానం చేయడం ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం ప్రపంచశాంతి కోసం జైన సమాజం ఏడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజున ఉపవాస దీక్షలు విరమించినట్లు తెలిపారు.. కార్యక్రమంలో జైన్ సమాజ్ అధ్యక్షుడు బాబూలాల్, కోశాధికారి ముఖేష్ జైన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో జైలు సమాజా అధ్యక్షుడు బాబూలాల్ బేగ్, సెక్రటరీ సుశీల్ సన్ శెట్టి, కోశాధికారి ముఖేష్, ఉపాధ్యక్షులు హిమాన్షు, నవీన్, సంయుక్త కార్యదర్శి రాకేష్ సురాన,దర్మెందర్, కార్యనిర్వాహక కార్యదర్శి నార్తన్, సలహాదారులు లక్ష్మి పట్ భేద్,లలిత్ భేధ్,నవీన్ దశని లు పాల్గొన్నారు..

Sri Jain Shretambar Terapant Sabha
Sri Jain Shretambar Terapant Sabha
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular