అయోధ్యకు శ్రీరామ ప్రసాదం
హైదరాబాద్
శ్రీరామ ప్రసాదాన్ని అయోధ్య కు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ పంపించింది. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శ్రీ నాగలక్ష్మి మాత దేవాలయం నుంచి అయోధ్య ధామానికి వెళ్లే ప్రసాద సామాగ్రి వాహనాన్ని… విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, దాతలు జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా దాతల సహాయంతో నిత్యం అన్నదానం చేసేందుకు 45 రోజుల పాటు నిత్యం 5000వేల మందికి భోజన ఏర్పాట్లు చేసినట్లు… విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారాజు తెలిపారు. అయోధ్యలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా నిత్యం అన్నదానం చేసేందుకు కమిటీని కేటాయించినట్లు తెలిపారు. 14 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతిరోజూ అయోధ్యను సందర్శించే… దాదాపు 5000 మంది భక్తులకు రోజువారీ భోజనాన్ని అందజేస్తుందన్నారు. భాగ్యనగర్ నుండి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు… ఈ ప్రయోజనం కోసం అయోధ్యకు వాలంటీర్లుగా వెళ్తున్నారని తెలిపారు. అలాగే 35 మంది వంటవాళ్లు కూడా రోజూ వండి వడ్డించబోతున్నారని… అయోధ్యలో అన్నదానం అయోధ్యలోని గోలాఘాట్ రోడ్లోని శ్రీరామస్వామి ఆలయంలో జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని పలువురు దాతల నుంచి ఆహార తయారీకి కావాల్సిన వివిధ 40 టన్నుల సామాగ్రిని సేకరించినట్లు విహెచ్పి ప్రతినిధు రామరాజు వెల్లడించారు
అయోధ్యకు శ్రీరామ ప్రసాదం
- Advertisement -
- Advertisement -